పేదల సేవలో పువ్వాడ కుటుంబం

12-09-2026 | 08:09pm

15 ఏళ్లుగా పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అనేక సేవా కార్యక్రమాలు

పువ్వాడ జన్మదిన వేడుకకు సేవా కార్యక్రమం.. దివ్యాంగులకు కృత్రిమ పాదాల వితరణ

ఖమ్మం,(విజయక్రాంతి): మానవతా సేవ, దాతృత్వం, సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తూ ఖమ్మం జిల్లాలో పువ్వాడ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ నిరంతరం సేవా స్ఫూర్తిని కొనసాగిస్తోంది. పువ్వాడ ఫౌండేషన్‌(Puvvada Foundation)ను స్థాపించి, పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను(Social service programs) నిర్వహిస్తున్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు(Free medical services), అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, మందుల పంపిణీ, గర్భిణులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ పేదలకు పువ్వాడ కుటుంబం భరోసాగా నిలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని వారికి సైతం అండగా నిలిచి, మానవతా దృక్పథంతో సేవలను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పువ్వాడ కుటుంబం ప్రజలకు అండగా నిలిచింది. కరోనా బాధితులకు వైద్య సేవలు, మందులు, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ఆపద సమయంలో ప్రజలకు తోడుగా నిలిచారు. అదేవిధంగా మమతా ఆసుపత్రి ద్వారా వైద్య సేవలను విస్తృతంగా అందిస్తూ, అనేక మంది పేదలు, నిరుపేదలు మరియు అవసరమైన వారికి వైద్యపరమైన సహాయాన్ని అందిస్తున్నారు.

వైద్య రంగంలో సేవలతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ పువ్వాడ కుటుంబం దాతృత్వాన్ని చాటుకుంటోంది. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం, అవసరమైన వారికి ఆపరేషన్లు మరియు మందులు అందించడం, దివ్యాంగులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాల ద్వారా “మానవ సేవే మాధవ సేవ” అనే భావనను ఆచరణలో చూపిస్తూ పువ్వాడ కుటుంబం తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

జన్మదిన వేడుకలకు సేవా కార్యక్రమం

ఈ నేపథ్యంలో మమతా వైద్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 88 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ పాదాలను పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించి, వారు మరింత స్వావలంబనతో ముందుకు సాగేందుకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. “జన్మదిన వేడుకలకు సేవా కార్యక్రమమే అర్థం” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పువ్వాడ కుటుంబం సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలవనుంది.

ఈ జన్మదిన వేడుక సేవా కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా పువ్వాడ 75వ పుట్టినరోజు నాటి నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది వరకు దాదాపు 1000 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు వితరణ చేసినట్టు పువ్వాడ కుటుంబీకులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలోని రోటరీ క్లబ్ వద్ద సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు దివ్యాంగులకు కృత్రిమ పాదాలను పంపిణీ కార్యక్రమాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు