గణపతి మండపాలకు ఆన్‌లైన్‌ నమోదు తప్పనిసరి

12-09-2026 | 08:25pm

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు.. డీజేలకు అనుమతి లేదు

విద్యుత్‌ తీగలకు దూరంగా మండపాలు ఏర్పాటు చేయాలి

నాగిరెడ్డిపేటలో గతేడాది 88 మండపాలు.. ఈసారి ఇప్పటివరకు 32 మాత్రమే ఆన్‌లైన్‌ నమోదు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi ) సందర్భంగా గణపతి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సీఐ రాజిరెడ్డి సూచించారు. శనివారం నాగిరెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల గణపతి మండపాల(Ganpati Mandapams) నిర్వాహకులు,యువజన నాయకులతో నిర్వహించిన సమావేశంలో సిఐ.రాజారెడ్డి మాట్లాడారు.ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలో గతేడాది మొత్తం 389 గణపతి మండపాలు ఏర్పాటు కాగా, నాగిరెడ్డిపేట మండలం(Nagireddypet Mandal)లోనే 88 మండపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది నాగిరెడ్డిపేట మండలంలో ఇప్పటివరకు 32 మండపాలకు మాత్రమే ఆన్‌లైన్‌ నమోదు పూర్తయిందని పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌లైన్‌ నమోదు చేసుకోవాలని సూచించారు.డీజేలకు అనుమతి లేదు.గణపతి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ రాజిరెడ్డి స్పష్టం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.మండపాల వద్ద పేకాట,మద్యం సేవించడం వంటి వాటికి తావివ్వకూడదన్నారు.భద్రతపై అప్రమత్తత అవసరం,

విద్యుత్‌ తీగలకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు.మండపాల వద్ద భద్రత కోసం ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు.దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు,సోలార్‌ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.రహదారులకు ఆటంకం కలిగించొద్దు.మండపాలను రహదారులను పూర్తిగా ఆక్రమించేలా ఏర్పాటు చేయవద్దని సీఐ రాజిరెడ్డి సూచించారు.అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు,ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలుగా తగినంత స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఫార్వర్డ్‌ చేయవద్దని,తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై భార్గవ్‌గౌడ్‌,వివిధ గ్రామాల గణపతి మండపాల నిర్వాహకులు,యువజన నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు