విధుల్లో ప్రతిభ చూపిన తొమ్మిదిగురికి సీపీ ప్రశంస

12-09-2026 | 10:43pm

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన 9 మంది పోలీసులను సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) అభినందించారు. ప్రతివారం విధినిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని గుర్తించి  'సీపీ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా సీపీ ప్రశంసిస్తున్నారు. అందులోభాగంగా హుస్నాబాద్ సీఐ శ్రీధర్(Husnabad CI Sridhar), హోంగార్డ్ లింగస్వామి, కోహెడ హెడ్ కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్ జి.వేణు, గౌరారం పోలీస్ కానిస్టేబుళ్లు ఎం.విష్ణుచందర్, రవి, సీఏఆర్ హెడ్ క్వార్టర్ కానిస్టేబుళ్లు బి.రాకేష్, బి.కార్తీక్, ఎం.సాహితి లకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రశంసాపత్రాలు, ప్రత్యేక కిట్లను అందజేశారు. అనంతరం సీపీ వారితో ముచ్చటించారు.

మరిన్ని వార్తలు