సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దేవదానం
13-10-2026 | 10:09pm
సత్తుపల్లి (విజయక్రాంతి): సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తడికిమళ్లు దేవదానం(Tadikimalla Devadanam) ప్రధాన కార్యదర్శిగా చీప్ గంగాధర్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ ఐక్యత సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావటంతో పాటు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.