ఉచిత వైద్య శిబిరంకు స్పందన
13-10-2026 | 06:36pm
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో మంగళవారం ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp)కు స్పందన లభించింది. ఇందులో హెల్త్ చెకప్ లు, 14వ వార్డు కౌన్సిలర్ ఆఫీసులో ఎక్స్ రే మిషన్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వార్డ్ కౌన్సిలర్ వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. డాక్టర్ సమీరా, సూపర్వైజర్ రోజా, ఏఎన్ఎం వినోద, ఆశ వర్కర్లు వసంత, పద్మ, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు.