జాతీయ రహదారుల వెంట పోలీసుల ఆకస్మిక తనిఖీలు

29-10-2026 | 11:09pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) ఆదేశాల మేరకు డీఎస్పీ బి. అశోక్(DSP B. Ashok) ఆధ్వర్యంలో జాతీయ రహదారుల వెంట ఉన్న టీ స్టాల్స్, పాన్ షాపులు, దాబాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయించడం, పర్మిట్ రూములు నిర్వహించడం, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.ఈ తనిఖీల్లో ఆసిఫాబాద్ సీఐ నీలం రవి, రెబ్బెన సీఐ సంజయ్ కుమార్, ఎస్‌ఐ వెంకట కృష్ణ, వాంకిడి ఎస్‌ఐ మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు