భరోసా, షీ టీం కేంద్రాలను సందర్శించిన యునిసెఫ్ బాలల రక్షణ బృందం

29-10-2026 | 11:06pm

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గల పోలీసు భరోసా కేంద్రం, షీ టీం కార్యాలయాలను యునిసెఫ్ బాలల రక్షణ బృందం(UNICEF child protection team) చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనికుట్టి జార్జ్, టెక్నికల్ అడ్వైసర్ డా ఫిలిప్స్ లు గురువారం అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి(Additional SP Ravinder Reddy)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లైంగిక దాడుల్లో బాధితులుగా ఉన్న మహిళా, బాల బాధితులకు పోలీస్ మహిళా భరోసా కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు.

బాధితులకు తక్షణ సహాయం ఎలా అందిస్తున్నారు, వారి రక్షణ, పునరావాసం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భరోసా కేంద్రం నందు నిర్వహిస్తున్న రికార్డ్స్ ను కౌన్సిలింగ్ విధానాన్ని పరిశీలించిన బృందం భరోసా పనితీరును అభినందించారు. తదుపరి ఈ కార్యాలయాల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి పరిక వివరించారు. ఈ కార్యక్రమంలో భరోసా టీం ఎస్ఐ మౌనిక, షీ టీం ఎస్ఐ నీలిమ, యునిసెఫ్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు