ఎల్నినో ప్రభావంపై అవగాహన
29-10-2026 | 11:30pm
భూపాలపల్లి రూరల్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కలెక్టర్, డీపిఆర్ఒ ఆదేశాల మేరకు టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో ఎల్నినో(El Nino) ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ సాంస్కృతిక సారథి(Telangana Samskruthika Sarathi) దుప్పటి రవి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, మొక్కలు పెంచడం తదితర అంశాలపై ప్రజలకు చైతన్య పరిచేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సాగర్, మంకాల యాకూబ్, కొండపర్తి స్వప్న, కంచర్ల శ్యామల, గడ్డం రజిత తదితరులు పాల్గొన్నారు.