ప్లాట్ల విక్రయాల్లో మోసం.. కేసు నమోదు

29-10-2026 | 11:35pm

గండీడ్,(విజయక్రాంతి): మండలపరిధిలోని బల్సూర్ గొండ గ్రామం(Balsur Gonda village)లో అదే ప్లాట్లను ఇద్దరికి విక్రయించినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గండీడ్ మండలం బల్సూర్ గొండ గ్రామానికి చెందిన కోట్ల అజయ్ కుమార్ రెడ్డి, రామిరెడ్డి కుమారుడు, అదే గ్రామానికి చెందిన కాజా మొయినుద్దీన్ వద్ద 2019లో సర్వే నంబర్‌ 1లోని భూమిలో ఏర్పాటు చేసిన ఇంటి స్థలాల్లో మూడు ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే, సదరు ప్లాట్లను అజయ్ కుమార్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించలేదు.

ఈ క్రమంలో అజయ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తాను గతంలో విక్రయించిన మూడు ప్లాట్లను కాజా మొయినుద్దీన్ 2026 జనవరిలో కొండాపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్యకు రిజిస్ట్రేషన్ చేసి విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో అజయ్ కుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.దీంతో మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు