ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి: శాస్త్రాల తిరుపతి

29-10-2026 | 11:26pm

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత విద్యను బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్ జీ ఒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. ఈ మేరకు డైరెక్టర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన అహల్య, అక్షిత, దీపిక, బూడిద శివరాం తేజలను గుర్తించి వారి తల్లిదండ్రులతో విద్య ప్రాముఖ్యతను విలువలను గురించి అవగాహన కల్పించి  ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ బాలబాలికల అభ్యున్నతికి భవిష్యత్ తరాలకు విద్యను అందించాలని, బడి బయట ఉన్న పిల్లలను  బడిలో చేర్చడానికి  టోల్ ఫ్రీ నెంబర్ 1098 నెంబర్ ను సంప్రదించగలరని కోరారు.

మరిన్ని వార్తలు