న్యూరో ఇంజనీరింగ్ పై అంతర్జాతీయ సదస్సు

29-10-2026 | 11:14pm

న్యూరో ఇంజనీరింగ్... పరిశోధనలు సాంకేతిక ఆవిష్కరణల బలోపేతమే లక్ష్యం

వైద్యరంగంలో న్యూరో సైన్స్, ఏఐ పరిశోధనల సహకారం కీలకం

బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో న్యూరో ఇంజనీరింగ్ పై అంతర్జాతీయ సదస్సు

జవహర్ నగర్,(విజయక్రాంతి): న్యూరో ఇంజనీరింగ్ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణ ల బలోపేతమే లక్ష్యమని యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్(BITS Pilani Dubai Campus) డైరెక్టర్ ప్రొఫెసర్ సౌరి బెనర్జీ పేర్కొన్నారు. న్యూరో ఇంజనీరింగ్ పరిశోధనలు(Neuroengineering Research) సాంకేతిక ఆవిష్కరణలను మరింత బలోపితం చేసే లక్ష్యంతో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో గురువారం మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.

గురువారం నుండి ప్రారంభమైన ఈ సదస్సు, ఈనెల 31 వరకు నిర్వహిస్తున్నామని ఈ సదస్సులో భారతదేశంతో పాటు విదేశాలకు చెందిన 15 మందికి పైగా నిపుణులు పాల్గొంటున్నారు. ఇందులో న్యూరో సైన్స్ వైద్యరంగం ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థశాస్త్రం వంటి విభిన్న రంగాలకు చెందిన పరిశోధకులు వైద్యులు సాంకేతిక నిపుణులు ఈ సదస్సులో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి పరిశోధన సమాఖ్య ఏర్పాటు ప్రత్యేక శిక్షణ మార్గాల అభివృద్ధి అనే ప్రధాన అంశంతో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదడు పనితీరుపై పరిశోధనలు బ్రెయిన్ మిషన్ ఎంటర్ న్యూరాల్ ఇంప్లాంట్లు మెదడు చిత్రీకరణ సాంకేతికత డీప్ బ్రెయిన్ స్టిములేషన్ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య నిర్ధారణ వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.

ఈ పరిశోధనలను వైద్య సేవలు పునరావాస చికిత్సలు వ్యాధుల నిర్ధారణలో ఆచరణాత్మకంగా ఉపయోగించుకునే అవకాశాలపై కూడా ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. స్వదేశీ న్యూరల్ ఇంటర్ఫేస్లు వైద్య పరికరాలు సాంకేతిక పరికరాల అభివృద్ధికి విద్యాసంస్థలు వైద్య నిపుణులు పరిశ్రమల మధ్య సహకారం అవసరమని సదస్సులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని  బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌరీ బెనర్జీ పేర్కొన్నారు.

భారతదేశంలో న్యూరో ఇంజనీరింగ్ పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనలు వైద్యులు ఇంజనీర్లు పరిశ్రమల ప్రతినిధులతో జాతీయ స్థాయి నెట్వర్క్ ను ఏర్పాటు చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి రెండేళ్లకోసారి ఈ సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ,అనుసంధాన్ నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరో సైన్సెస్ తో పాటు పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు