రూ.5.11 లక్షలకు బోధన్ సార్వజనిక్ గణేష్ లడ్డు వేలం

25-09-2026 | 03:54pm

బోధన్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి):బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయ(Sri Chakraswara Temple) ప్రాంగణంలో కొలువుదీరిన బోధన్ సార్వజనిక్ గణేష్ లడ్డు వేలం గురువారం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ వేలం పాటలో రాకాసిపేటకు చెందిన సాయి రాహుల్ రూ.5,11,000లకు లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం కార్యక్రమంలో ఆలయ ఈవో నాయకం రాములు, 16 చక్రాల గణేష్ మహారాజ్, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, చివరకు సాయి రాహుల్ అత్యధిక ధరకు లడ్డును దక్కించుకున్నారు.

వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం విజేత సాయి రాహుల్‌ను నిర్వాహకులు అభినందించారు.

మరిన్ని వార్తలు