విద్యుత్ సరఫరా అంతరాయం

04-11-2026 | 09:47pm

నిర్మల్ నవంబర్ 4 ( విజయ క్రాంతి): పట్టణంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ ఏడిఏ శ్రీనివాసరావు(ADA Srinivasa Rao) తెలిపారు. లైన్ పనుల కారణంగా ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో(Electricity supply) అంతరాయం ఉంటుందన్నారు.

- ప్రియదర్శిని నగర్

- బర్కత్‌పురా

- ఆర్టీసీ బస్ స్టాండ్ పక్క ప్రాంతం

- ఏరియా హాస్పిటల్

- జ్యుడీషియల్ కాలనీ

- వశిష్ట కాలేజ్

సంబంధిత ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు

మరిన్ని వార్తలు