మళ్లీ మైక్ పట్టిన సల్మాన్
‘తేరి సెక్సీ బ్యూటీ’తో సర్‌ప్రైజ్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) మరోసారి తనలోని Singerను బయటకు తీశాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి’ నుంచి ‘తేరి సెక్సీ బ్యూటీ’ పాట విడుదలైంది. ఈ గీతాన్ని సల్మాన్ స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముస్కాన్‌తో కలిసి ఆయన ఈ పాటకు గొంతు కలిపాడు. ఈ పాటకు హిమేష్ రేషమియా స్వరాలు సమకూర్చగా, సాజిద్ ఖాన్ సంగీతంతో పాటు Lyrics అందించారు. సీజర్ గోన్సాల్వెస్ Choreography బాధ్యతలు చేపట్టారు.
‘May War Rest in Peace’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన పాట ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పాట విడుదల సందర్భంగా సల్మాన్ సోషల్ మీడియాలో Recording Studio వీడియోను షేర్ చేశాడు. ఉదయం 5:12 గంటలకు బయలుదేరుతున్నానంటూ సరదా Caption పెట్టి అభిమానులను నవ్వించాడు. గతంలో ‘వాంటెడ్’, ‘కిక్’, ‘సుల్తాన్’, ‘హీరో’ వంటి సినిమాల్లోనూ పాటలు పాడిన సల్మాన్.. ఇప్పుడు ‘తేరి సెక్సీ బ్యూటీ’తో మరోసారి తన Singing టాలెంట్‌ను చూపించాడు.