కనుబొమ్మలు సమర్పిస్తున్న గోండు గిరిజనులు..

04-11-2026 | 10:08pm

ఏత్మాసూర్  దేవుడికి 23 ఏళ్ల తర్వాత కనుబొమ్మల సమర్పణ...

ఉట్నూర్, నవంబర్04 ( విజయక్రాంతి ): ఆదివాసి  గోండు గిరిజనుల(Gond Tribals Offer ) సంస్కృతి.. సాంప్రదాయం... ఆచార వ్యవహారాల ప్రకారంగా ఎత్మాసూర్ దేవుడికి  కనుబొమ్మల వెంట్రుకలు.. తల నీలాలు సమర్పించడం ఆచారం.. కనుబొమ్మల  వెంట్రుకలతో పాటు  తలనీలాలు సమర్పించుటకు   అవకాశం వచ్చిన ఏడాది  ఆదివాసులు సమర్పిస్తుంటారు. కనుబొమ్మల వెంట్రుకలతో పాటు  తలనీలాలను దండారి ఉత్సవాల ప్రారంభం(Commencement of Dandari Festivals)  సమర్పిస్తుంటారు.

ఈ ఆచారం అన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది. కనుబొమ్మలు,  తలనీలాలు సమర్పించే  సమయంలో ఇంటి ఆడపడుచులు  లేదా మేనత్తలు  కింద పడకుండా   జాగ్రత్తలు పడుతూ... కొంగులు వెంట్రుకలను పడేవిధంగా  ముందు వరసలో  ఉంటారు. ఏత్మా సూర్య దేవుడికి  వెంట్రుకలు సమర్పించే సమయంలో ఇంటి ఆడపడుచులతో పాటు  మేనత్తలు వారి ఇంటి  నుంచి నువ్వు లు,బెల్లం కూడక లు తీసుకు వస్తారు.

బుధవారం ఆదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి మండలంలోని  పిట్ట బొంగరం గ్రామంలో  యువకులకు కనుబొమ్మల వెంట్రుకలతో పాటు  తలనీలాలను  ఎత్మాసూర్ దేవుడికి  సమర్పించుటకు 23 ఏళ్ల తర్వాత వచ్చిందని గ్రామ పటేల్ పెట్టి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ మాడవి ఇంద్ర దేవ్  తోపాటు గ్రామ పెద్దలు తెలిపారు. 2003 లో ఈ అవకాశం వచ్చిందని, అప్పటినుండి  కనుబొమ్మల వెంట్రుకలు తీసేందుకు అవకాశం రాలేదని  గ్రామస్తులు వివరించారు.

మరిన్ని వార్తలు