సూర్యకు మూడు సార్లు నో చెప్పిన నజ్రియా

04-11-2026 | 01:15pm

తమిళ స్టార్ హీరో సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’(Scene movie release date) విడుదలకు సిద్ధమైంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన Pre-Release Eventలో సూర్య వెల్లడించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో తన మూడు సినిమాల్లో నటించాలని నజ్రియాను సంప్రదించినా ఆమె అంగీకరించలేదని సూర్య తెలిపారు. నాలుగోసారి అడిగినప్పుడు మాత్రం ఓకే చెప్పిందని వెల్లడించారు. చివరకు తనతో కలిసి నటించేందుకు అంగీకరించినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు.

దీనిపై నజ్రియా స్పందిస్తూ.. దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నానని, ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించడానికి సూర్యనే ప్రధాన కారణమని పేర్కొన్నారు. గతంలో కొన్ని కారణాలతో ఆయన సినిమాలను వదులుకున్నానని, ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. సూర్య, నజ్రియా కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి On-Screen Chemistry ఎలా ఉండబోతోందో తెలియాలంటే నవంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు