రైతు భరోసా నిధుల కోసం రైతుల ఎదురుచూపులు

04-11-2026 | 10:07pm

బెజ్జంకి, (విజయక్రాంతి): రైతు భరోసా నిధులు(Rythu Bharosa Funds) ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి అన్నారు. నగదు జమ అయినట్లు ఫోన్లకు సందేశాలు వస్తున్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కనిపించడం లేదని పేర్కొన్నారు. 

రైతులు ఉదయం నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిధుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు