రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

04-11-2026 | 10:13pm

* పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలి

* సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ 

బెజ్జంకి, నవంబర్ 4: వర్షభావంతో సాగునీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పంట నష్టపరిహారం అందించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్(District Secretary Manda Pawan) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బుధవారం బెజ్జంకి మండలం సీపీఐ నాయకులతో కలిసి మండలంలోని గ్రామాల్లో ముత్తనపేటలో పర్యటించి ఎండిపోయిన వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎన్నో ఆశలతో అప్పులు చేసి, కుటుంబ అవసరాలను పక్కనపెట్టి, వ్యవసాయంపై నమ్మకంతో పంటలు సాగు చేస్తున్నారని అన్నారు.

పంట చేతికొచ్చే సమయంలో ఎల్ నినో ద్వారా వర్షాభావ పరిస్థితులతో నీటి కొరత కారణంగా వరి పంటలు ఎండిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పంట దిగుబడి రాకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని, మరోవైపు అప్పుల భారం పెరిగి భవిష్యత్తులో వ్యవసాయం కొనసాగించడమే కష్టంగా మారుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, నాయకులు దొంతరవేణి మహేష్, బోనగిరి శ్రావణ్, పండుగ సంపత్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు