రేవంత్‌పై జీవన్ రెడ్డి ఫైర్
తుమ్మిడిహట్టిపై అవగాహన లేకుండానే చర్చలా? రేవంత్‌పై జీవన్ రెడ్డి ఫైర్!
హైదరాబాద్: తుమ్మిడిహట్టి ప్రాజెక్టు(Thummidihatti Project) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం సరైన అవగాహన, ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తోందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు, ముంపు ప్రాంతాలపై ఇప్పుడు Review Meeting నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన Media Conferenceలో ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయి Report, DPR వివరాలు లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
మరోవైపు కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఇప్పటికీ సుమారు 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, అయినప్పటికీ నీటిని ఎత్తిపోయడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి నీటిని వెంటనే Lift చేయాలని సూచించారని గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద Coffer Dam నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ మరమ్మతులు చేపట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రాజెక్టులపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ‘RR Tax’ పేరుతో వసూళ్లకు ప్రాధాన్యం ఇస్తూ పాలనను గాలికొదిలేశారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరుతో రాజకీయ ప్రచారం కాకుండా, క్షేత్రస్థాయిలో నీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.