ఆర్‌జియుకెటి మూడు రోజుల సదస్సు ప్రారంభం
భైంసా, నవంబర్ 4 (విజయక్రాంతి): బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జియుకెటి) పరిపాలనా భవనంలో “క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అప్లికేషన్స్(Quantum Communication Training)” అనే అంశంపై మూడు రోజుల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 4 నుండి 6 వరకు జరిగే కార్యక్రమానికి ఐఐటిఎమ్ సి-డాట్ సంజ్ఞా టెక్నాలజీస్ ఫౌండేషన్ సహకారం ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ తెలిపారు. కార్యక్రమ లక్ష్యాలను ఎఫ్‌డిపి కోఆర్డినేటర్ డాక్టర్ కె. మహేష్ వివరిస్తూ, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటింగ్ రంగాల్లో క్వాంటమ్ సాంకేతికత చాలా కీలకమని చెప్పారు. అధ్యాపకులు, విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచడం, పరిశోధనలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
సంజ్ఞా టెక్నాలజీస్ సీఈఓ డాక్టర్ రవీంద్ర బార్లింగే మాట్లాడుతూ, ఆర్‌జియుకెటి బాసర విద్యార్థులు, అధ్యాపకులకు ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, పరిశోధన నిధులు అందించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు. క్యూక్లైర్వాయన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ డైరెక్టర్ కల్నల్ సాయి శంకర్ పి రూ.40 లక్షల విలువైన 40 క్వాంటమ్ సాఫ్ట్వేర్ లైసెన్సులను ఉచితంగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులకు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ మూడు రోజుల శిక్షణలో క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్, సర్క్యూట్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి అంశాలపై ప్రాక్టికల్ నిర్వహించనున్నారు