ఆరోగ్య తెలంగాణ సాధిద్దాం
25-09-2026 | 04:45pm
నిర్మల్ ,సెప్టెంబర్ 4 ( విజయ క్రాంతి) : పిల్లలు ఆరోగ్యంగా(Childrens Health) ఉన్నప్పుడే తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుందని సీనియర్ సివిల్ జడ్జి పి రవీందర్(Senior Civil Judge P Ravinder), జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం నిర్మల్ మండల్(Nirmal Mandal) కొండాపూర్ బాలసదనలో ఉంటున్న విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్య శిబిరాన్ని(Free health camp) ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనాధ పిల్లలకు మంచి పౌష్టికాహారం దుస్తులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమ్యదేవి, ప్రేమ్ రాజ్ సురేష్ గబ్బర్ సింగ్ సతీష్ సిబ్బంది ఉన్నారు.