ఖానాపూర్ కోర్టుకు రెగ్యులర్ జడ్జి నియామకం

04-11-2026 | 06:41pm

శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా బిసి నికిత(BC Nikitha) నియమితులయ్యారు. ఇటీవల నియామకాల్లో ఖానాపూర్ కోర్టులో ఇదివరకు ఇన్చార్జి జడ్జిగా విధులు నిర్వహిస్తున్న బీసీ నిఖితను ఫుల్ ఛార్జ్ రెగ్యులర్ జడ్జిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో ఖానాపూర్ న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు మట్టేరి రాజశేఖర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజిపి ఆసిఫ్ అలీ, జాయింట్ సెక్రెటరీ శివ బాసెట్టి, సీనియర్ న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, రాజురాసత్యం, కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎగ్జీక్యూటీవ్ మెంబర్లు షబ్బీర్ పాష, షేక్ ఖదీర్, రాచమల్ల అశోక్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు