పుస్తక జ్ఞానానికి ప్రయోగాత్మక రూపం..

04-11-2026 | 07:15pm
  1. విద్యార్థుల సైన్స్ మ్యూజియం సందర్శన
  2. జిల్లా సైన్స్ మ్యూజియం సందర్శించిన గ్లోబల్ రెయిన్ బో విద్యార్థులు 
  3. ఆకట్టుకన్న నమునాలు..ఆసక్తి పెంచిన ప్రయోగాలు 

కూసుమంచి, నవంబర్ 4 విజయక్రాంతి: ఖమ్మం నగరంలోని సైన్స్ మ్యూజియంను(Science Museum) బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ బో పాఠశాలకు(Global Rainbow School) చెందిన విద్యార్థులు సందర్శించారు. పాఠశాలలో తొమ్మిది, పదో తరగతులకు చెందిన మొత్తం 80 మంది విద్యార్థులు ఈ సందర్శనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు, ఆధునిక పరికరాలు, వాటి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు.తరగతి గదుల్లో పుస్తకాల ద్వారా నేర్చుకున్న సైన్స్ పాఠాలను ప్రత్యక్షంగా చూడటంతో విద్యార్థులు ఎంతో ఆసక్తి, ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

శాస్త్రీయ అంశాలను ప్రయోగాల ద్వారా అర్థం చేసుకోవడంతో పాటు వాటి వెనుక ఉన్న సూత్రాలను తెలుసుకునే అవకాశం వారికి లభించింది.ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాస్, ఇన్‌స్ట్రక్టర్లు ఆదిత్య కుమార్, నవీన్ కుమార్ విద్యార్థులకు పలు శాస్త్రీయ అంశాలను వివరించారు. బ్లాక్ హోల్ కాన్సెప్ట్, ఇన్ఫినిటీ వెల్, డెప్త్ పర్సెప్షన్, ఫ్లోటింగ్ బాల్, సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వంటి అంశాలను ప్రయోగాల ఆధారంగా వివరించి వాటి పనితీరును తెలియజేశారు.

అదేవిధంగా ప్రాక్సినోస్కోప్, న్యూటన్ క్రెడిల్, యాంటీ గ్రావిటీ డబుల్ కోన్, మానవ శ్వాస వ్యవస్థకు సంబంధించిన నమూనాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రయోగాన్ని ఆసక్తిగా పరిశీలించిన విద్యార్థులు తమకు కలిగిన సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. మొత్తంగా విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగి కలిగేలా మ్యూజియం సందర్శన కొనసాగింది.  ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్, ఉపాధ్యాయులు సైదులు, రాంబాబు, ఉపేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు