విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి.. రైతుకు రూ.80 వేల నష్టం

04-11-2026 | 07:23pm

బిక్కనూర్ నవంబర్ 4 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bikkannur Mandal) అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు ఏనుగు నర్సారెడ్డికి చెందిన పాడి గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ ఘటనతో రైతు కుటుంబం ఆవేదనలో మునిగింది. గేదె మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పశువైద్య సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని, దీంతో తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. పాడి గేదెపై ఆధారపడి జీవనం సాగించే తనకు ఈ నష్టం భారంగా మారిందని తెలిపాడు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు