దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణంలో జగిత్యాల వాసులు
జగిత్యాల, నవంబర్ 4 ( విజయ క్రాంతి ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా(Doddi Komarayya Movie) నిర్మాణంలో సహ నిర్మాత లుగా జగిత్యాల నివాసులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ ఈ చిత్ర దర్శకుడు ఎం. సేనాపతి మాట్లాడుతూ తెలంగాణ వీరుల చరిత్రను దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామన్నారు. కేవలం రూ. 10 వేల తోనే సహ నిర్మాతలుగా 33 జిల్లాల్లో తీసుకున్నామన్నారు.
జగిత్యాల జిల్లాలో దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ మానాల కిషన్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ లు మాట్లాడుతూ తెలంగాణ వాళ్లు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలే రోజులు రావాలన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు.
జగిత్యాల జిల్లాలో దొడ్డి కొమరయ్య సినిమా సహ నిర్మాతల్లో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది హరి అశోక్ కుమార్, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, రిటైర్డ్ తహసీల్దార్ పుప్పాల హనుమంత రెడ్డి, రిటైర్డ్ జిల్లా సహకారశాఖ అధికారి బొల్లం విజయ్, ప్రజా సంఘాల నేత తుల రాజేందర్, కౌ న్సిలర్ పిట్ట ధర్మరాజు, సింగం భాస్కర్, బీసీ మహిళా జేఏసీ జగిత్యాల పట్టణ అధ్యక్షురా లు సింగం పద్మ, ఆడేపు జానయ్య, కుర్మ సంఘం నేతలు పుల్ల మల్లయ్య, దయ్యాల మల్లారెడ్డి, తెలంగాణ ఉద్యమ కారులు జవ్వాజీ శంకర్, భారతపు లింగారెడ్డి తదితరులున్నారు.