నిబంధనలకు విరుద్ధంగా డ్రైనేజ్ నిర్మాణ పనులు
సిపిఎం నాయకులు ఆనంద్
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్(Kagaznagar) మున్సిపాలిటీలో చేపడుతున్న మురికి కాలువల నిర్మాణ పనులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా సభ్యులు ముంజం ఆనంద్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని కాపువాడలో రూ. 1.50 కోట్లతో జరుగుతున్న మురికి కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు.
మురికి కాలువ నిర్మాణ పనుల సందర్భంగా మార్కింగ్ చేసిన విధంగా తవ్వకాలు చేసి, పనులు చేయాలని అన్నారు. కానీ మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు మార్కింగ్ చేశారని అన్నారు. మార్కింగ్ చేసిన విధంగా తవ్వకాలు చేసి, డ్రైవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. రాజకీయ పలుకుబడి, బందు ప్రతి సాకుతో మార్కింగ్ చేసిన విధంగా మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. అధికారులు నిబంధనలు విస్మరించి నిర్మలచే పడితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.