చౌక ధరల దుకాణంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు

04-11-2026 | 07:20pm

చేగుంట నవంబర్ 04 (విజయక్రాంతి): చేగుంట మండలంలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాల(PM Shri Government School) 8వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి చౌక ధరల దుకాణం అనే పాఠ్యాంశాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేగుంటలో ఉన్నటువంటి చౌకధరల దుకాణాన్ని విద్యార్థులు పరిశీలించడం జరిగింది.

విద్యార్థులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ద్వారా ఒక వ్యక్తికి ఆరు కేజీలు బియ్యం వస్తాయని, అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి 35 కేజీల బియ్యాన్ని, అన్నపూర్ణ కార్డు ద్వారా 10 కేజీల బియ్యం వస్తాయని చౌక ధరల రేషన్ డీలర్ శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉదయం సాయంత్రం చౌక ధరల దుకాణం తెరిచి ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రమ, సిఆర్పి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు