ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో
04-11-2026 | 07:28pm
బోథ్ నవంబర్ 4 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సి బాలుర వసతి గృహాన్ని బుధవారం ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ లోని రికార్డులను పరిశీలించి స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని వార్డెన్ విజయ రెడ్డికి సూచించడం జరిగింది. రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో పలు గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఇంకుడు గుంతలను పరిశీలించడం జరిగింది.