సర్పంచ్ భర్త కాంట్రాక్టు పనులకు పంచాయతీ సిబ్బంది వినియోగం...
సిబ్బందిని అడిగితే అడ్డగోలుగా సమాధానాలు
కోదాడ నవంబర్ 04(విజయ క్రాంతి): మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో(Kuchipudi Village) సర్పంచ్ భర్త కాసాని వెంకటేశ్వర్లు ఆగడాలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. బుధవారం ,తన సొంత కాంట్రాక్ట్ పనులకు సిబ్బందిని వినియోగిస్తూ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహారిస్తున్నారు. సిబ్బందిని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్తూ సర్పంచ్ భర్తను వెనకేసుకొస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో గ్రామంలో పారిశుద్యం అస్తవ్యస్తంగా ఉన్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదు.
అసలు సర్పంచ్ గారి జాడ లేనే లేదు అని గ్రామస్థులు వాపోతున్నారు.ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ సిబ్బంది అక్కడే పని చేస్తూ ఉండడంతో సర్పంచ్ భర్త ప్రమేయం ఎంత ఉందో అర్ధమవుతుంది. గతంలో కూడా సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పెత్తనం చేలాయిస్తున్నాడని పలువురు వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది.