మహిళలు ఉన్నత శిఖరాలు చేరాలి
కాగజ్‌నగర్, మార్చి 8 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి రాణించాలని కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీన్ సుల్తానా అన్నారు. పీఆర్టీ యూ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో అనురాధ బాయి అధ్యక్షతన స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ షాహీన్ సుల్తానా, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ ఎదగాలని, ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు ఉన్నత శిఖరాలు చేరేందుకు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉండాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఉపాధ్యాయులు ఘన సన్మానం చేశారు. అలాగే వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించి, ఆటపాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సమత, సుజాత, గంగాభవాని, విజయ నిర్మల, శ్రీదేవి, ముంతాజ్ బేగం, సునిత, కవిత, భారతి, నాగరాణి, విజయలక్ష్మి, వనితతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




