బీసీ సబ్‌ప్లాన్ అమలెప్పుడు?
తెలంగాణ రాష్ట్ర (2026- బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో వెనుకబడిన తరగతుల సమస్య మరోసారి రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసింది. రాష్ట్రంలోని బీసీల జనాభా సుమారు 56.33 శాతం ఉన్నట్లు కులగణన నిరూపించింది. బడ్జెట్ కేటాయింపుల్లో సమాన వాటా లభించడం లేదని, ఇది సామాజిక అన్యా యమని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. దీనిపై పార్టీలకతీతంగా పోరాటం అవసరం.
ముందుగా జనాభా వాస్తవాన్ని అర్థం చేసు కోవాలి. తెలంగాణలో 2024 లో నిర్వహించిన సమగ్ర కులగణన ప్రకా రం, బీసీలు మొత్తం జనాభాలో 56.33 శా తం ఉన్నారు. బీసీలు రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థకు వెన్నెముక. వ్యవసాయం, చిన్న పరిశ్రమ లు, కార్మిక రంగాలు, వ్యాపా రాల్లో బీసీల ప్రాతినిధ్యం అధికం. ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల మాదిరిగా బీసీ సబ్‌ప్లాన్ చట్టం కూడా జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలన్నది బీసీల ప్రధాన డిమాండ్.
2023 ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఏటా రూ.20,000 కోట్లు బీసీ సబ్‌ప్లాన్ కింద కేటాయిస్తామని, ఐదేళ్లలో మొత్తం లక్ష కోట్లు వెచ్చిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామినిచ్చింది. అయితే గత రెండేళ్ల బడ్జెట్ అమలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. 2024 బీసీ సంక్షేమం కోసం సుమారు రూ.9,200 కోట్లు, 2025- రూ.11,405 కోట్లు కేటాయించారు. అయితే బీసీలకు సంబంధించి విడుదలైన నిధులు మాత్రం రూ.2,300 కోట్లు మాత్రమే అని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులు, సంఘాలు పార్టీలకతీతంగా పోరాటం ప్రారంభించారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిం చాలి. ఈసారి బడ్జెట్‌లో కనీసం రూ.25 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు కేటా యించాలని, కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తు న్నాయి. ఇటీవల బీసీ రైట్స్ మూవ్‌మెంట్ వంటి సంస్థ లు రూ.55 వేల కోట్లు కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. బీఆర్ ఎస్ నాయ కులు కూడా బడ్జెట్‌లో పోల్ ప్రామిసెస్ అమలుకు నిధులు కేటా యించాలని లేఖలు రాయడంతో ఈ సమస్య పార్టీలకతీతంగా మారిపో యింది.
బీసీలు రాష్ట్ర జనాభాలో అధికం కావడంతో వారి అభివృద్ధి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకం. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా విద్యా స్కాలర్‌షిప్‌లు, విదేశీ చదువులు, బీసీ బజార్లు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీములు, హాస్టళ్లు, ట్రైనిం గ్ సెంటర్లు అమలు చేయాలి. కానీ నిధులు తక్కువగా విడుదల చేయడంతో పథకాలు కాగితాలకే పరిమి తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లు జనాభా ప్రాతి పదికన అమలవుతున్నాయి. అదే విధంగా బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసి, ప్రతి బడ్జెట్లో 56 శాతం కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్‌ను డెలివరీ బడ్జెట్‌గా ప్రకటించాలని చెప్పుకుంటున్న నేపథ్యంలో, కామారెడ్డి హామీలను నిజం చేయాలి.
కనీసం రూ.25 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్ కింద కేటాయించి, సకాలంలో విడుదల చేయాలి. నిధుల వినియోగం పారద ర్శకం గా ఉండాలి. బీసీ బ్యాంకులు, కార్పొరేషన్లు బలోపేతం చేయాలి. ఇది కేవలం రాజకీయ హామీ కాదు. ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగ బాధ్యత. బీసీలు ఓట్ల కోసం కాదు, వారు రాష్ట్రాభివృద్ధికి మూలస్తంభాలు. హామీలు అమలు చేయకపోతే, ఏ ప్రభుత్వమైనా నమ్మకం కోల్పోతుంది. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం బీసీల డిమాండ్లకు న్యాయం చేయాలి. అన్ని పార్టీలు, సంఘాలు కలిసి పోరాడితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.




