9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం

09-03-2026 12:47 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

సనత్‌నగర్, మార్చి ౮ (విజయక్రాంతి): అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన అమీర్ పేట లోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్‌లో 14 సంవత్సరాల లోపు బాలికలకు వేసే హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ లో అందుతున్న సేవలు, సౌకర్యాలు, సమస్యల గురించి పేషేం ట్స్, హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హాస్పిటల్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రానున్న రోజుల్లో 100 పడకల హాస్పిటల్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆర్‌ఎంవో వినాయక్‌రావు, సూపరిం టెండెంట్ రవూప్,  బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్,  కూతురు నర్సింహ, కట్టా బలరాం తదితరులు పాల్గొన్నారు.