చిన్నారుల కన్నీళ్లు తుడవాలి
- ఆపరేషన్ ముస్కాన్ సమన్వయంతో పని చేయాలి
- నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు‘
- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): జిల్లాలో బాల్యం బందీ కాకూడదని, అదృశ్యమైన చిన్నారులను రక్షించి వారి ము ఖాల్లో నవ్వులు పూయించడమే లక్ష్యంగా ప నిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిరణ్మయితో కలిసి ‘ఆపరేషన్ ముస్కాన్XII’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ ము స్కాన్ కేవలం ఒక శాఖ బాధ్యత కాదు.
పో లీస్, కార్మిక, సంక్షేమ శాఖలు ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేస్తేనే చిన్నారుల కు విముక్తి లభిస్తుంది. కనుచూపు మేరలో బాలకార్మికులు ఉండొద్దన్నారు. జిల్లాలో ఎక ్కడైనా సరే బాల కార్మికులు లేదా బాండెడ్ లేబర్గా పిల్లలు మగ్గిపోతుంటే సహించేది లేదని, ఫీల్ లెవెల్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.చిన్నారులపై వేధింపులు లేదా బాలకార్మిక వ్యవస్థపై స మాచారం అందిన వెంటనేఉన్నతాధికారుల కు నివేదించి, క్షణాల్లో రెస్క్యూ ఆపరేషన్ చే పట్టాలి.
తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠి న చర్యలు తీసుకోవాలి. రక్షించిన పిల్లలను చైల్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి, వా రికి సురక్షితమైన ఆశ్రయం కల్పించాలి. ఇత ర రాష్ట్రాల పిల్లలను వారి స్వగ్రామాలకు చే ర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పిల్లల రక్షణ కోసం పోలీస్ శాఖ 24 గంటలూ అండగా ఉంటుందని భరోసా ఇ చ్చారు.
జిల్లాలోని అన్ని డివిజన్లలో చైల్డ్లైన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అనుసంధా నం చేశామని జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.సమన్వయ సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ నరేందర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, కార్మిక శాఖ అధికారులు మరియు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు.






