3 July, 2026 | 1:25 AM

విద్యకు తోడ్పాటు ఉన్నతమైంది

03-07-2026 12:28 AM
  1. విద్యార్థులకు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ వారిచేత కిట్ల అందజేత
  2. ఊరేళ్ళ సర్కార్ హైస్కూల్ హెచ్‌ఎం ఇలియాస్

చేవెళ్ళ జులై 02(విజయక్రాంతి): ఊరేళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంస్థ విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్ అందజేశారు. నోటు పుస్తకాలు, జామెంట్రీ బాక్స్, పెన్నులు, పెన్సిల్లు, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, గొడుగుతో సహా మొత్తం 14 రకాల వస్తువులతో కూడిన సుమారు రూ. 1000/- విలువైన కిట్ 8,9,10 క్లాస్ 65 మంది విద్యార్థులందరికీ అందజేశారు. ప్రైమరీ 5త్ క్లాస్ 20 మంది విద్యార్థులకు కిట్ లను అందజేశారు.

అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు చక్రవర్తి రెడ్డి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతో ప్రతిభ ఉన్న మట్టిలోని మాణిక్యాల వంటి వారిని ప్రశంసించారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను కల్పించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని కార్యదర్శి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. దాతల సేవలు చిరస్మరణీయమని, పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. గత విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలకు అందించిన సహకారాన్ని ఎప్పటికి మరవలేమని విద్యకు తోడ్పాటు అందించడం ఉన్నతమైదన్నారు.

రోటరీ క్లబ్ ప్రతినిధులు పాఠశాలల్లోని మూత్రశాలలను మరుగుదొడ్లను పరిశీలించి పునర్నిర్మించడానికి అయ్యే ఖర్చు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. దాతల సహకారంతో మూత్రశాలలను పునర్నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు బాలామణి సువర్ణ రోటరీ క్లబ్ ప్రతినిధులలో సర్వీస్ డైరెక్టర్ అభిషేక్ రెడ్డి పబ్లిక్ ఇమేజ్ నాగరాజు సభ్యులు డాక్టర్ రామరాజు దేవేందర్ రెడ్డి భాను ప్రకాష్ హనుమంత్ రెడ్డి సుభాష్ ఉపాధ్యాయులు మహమ్మద్ అక్బర్, కృష్ణ ప్రకాష్ రెడ్డి, రాఘవేందర్, ప్రవీణ్, చాముండేశ్వరి, నర్మదా, ప్రసన్నలక్ష్మి, వల్లి కుమారి, వెంకటేశం, సునీత తదితరులు పాల్గొన్నారు.