9 April, 2026 | 10:15 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సినిమాలకు విజయ్ గుడ్ బై!

29-12-2025 02:44 AM

తమిళ సూపర్ స్థార్ సంచలన ప్రకటన

చెన్నై, డిసెంబర్ 28: తమిళ సూపర్‌స్టార్, ‘దళపతి’ విజయ్ తన సినీ జీవితా నికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూర్తి స్థాయి రాజకీ యాలపై దృష్టి పెట్టేందుకు నటన నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో, దాదాపు 90,000 మంది అభిమానుల మధ్య జరిగిన ’జన నాయగన్’ చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, ప్రజాసేవ కోసమే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ‘నా కోసం థియేటర్లలో నిలబడిన అభిమానుల కోసం, రాబోయే 30-33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్ ఫ్యాన్స్ కోసమే నేను సినిమాను వదిలేస్తున్నాను‘ అని ఆయన భావోద్వేగంగా ప్రసం గించారు. తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో అభిమానులు అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నా రు. ‘నేను ఇసుకతో చిన్న ఇల్లు కట్టుకుందామని సినిమాలోకి వస్తే, మీరంతా నాకు ఒక రాజమహల్ ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు‘ అని విజయ్ పేర్కొన్నారు.

’జన నాయగన్’ చివరి చిత్రమని.. 

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’జన నాయగన్’ తన 69వ చివరి చిత్రమని విజయ్ ఈ వేదికగా తేల్చిచెప్పారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ’తమిళగ వెట్రి కళగంస (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.