15 May, 2026 | 8:17 PM

Breaking News

బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •  

బాయిల్డ్ రైస్ ఔట్.. రా రైస్ ఇన్!

21-02-2026 02:16 AM

రాష్ట్రాలు దాటిస్తున్న మిల్లర్లు

బాయిల్డ్‌కు అనుమతి లేదంటూ టన్నుల కొద్ది తరలింపు

మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ముగిసింది. బియ్యం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలించుడు షురూ అయ్యింది. జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు నాలుగు ఏజన్సీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించి డిఫాల్టులో లేని మిల్లులకు తరలించారు. మిల్లుల సామర్థ్యం మేరకు దించుకున్న మిల్లర్లు మిల్లింగ్ చేసి బియ్యం ప్రభుత్వాని (ఎఫ్‌సీఐ లేదా సివిల్ సప్లయ్)కి కోటా ప్రకారం పెట్టాల్సి ఉంటుంది.

కానీ జిల్లాలో ఈ విధానం అమలు కావడం లేదు. కేవలం అమ్ముకోవడం, కొనుగోలు చేయడమే జరుగుతుంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖలకు తెలిసే జరుగుతుందా..! లేక అధికారుల కండ్లుకప్పి అక్రమంగా తరలిస్తున్నారా? ఈ వ్యవహరించడం వెనక మతలాబేంటో తెలియాల్సి ఉంది.

మంచిర్యాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నుంచి మిల్లర్లు పెద్ద మొత్తంలో బియ్యం రాష్ట్రాలు దాటిస్తుండ్రు. కొందరు మిల్లర్లు ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్ ఫోర్టు చేస్తుంటారు.ఇంత వరకు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి కొంత మంది మిల్లర్లు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఇదంతా సంబంధిత శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖలకు తెలిసే జరుగుతుందా..! లేక అధికారుల కండ్లుకప్పి అక్రమంగా తరలిస్తున్నారా? తెలియాల్సి ఉంది. ఇటీవల మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కార్తికేయ ఇండస్ట్రీస్ నుంచి బియ్యం ఆంధ్రాకు తరలిస్తున్న వాహనాన్ని లారీ అసోసియేషన్ నాయకులు ఆపడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

కోటా కేటాయించడం లేదంటూ..

రైస్ మిల్లర్లు అక్రమంగా జిల్లా నుంచి బాయిల్డ్ రైస్ బయటకు పంపుతు, ఇతర రాష్ట్రాల నుంచి రా రైస్‌ను తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కోటా ఇవ్వ డం లేదంటూ మిల్లర్లు ఈ దందా మొదలు పెట్టారు. 2024 రబీ సీజన్‌కు సంబంధించి దాదాపు రెండు వేల మెట్రిక్ టన్నులకు పైగా కోటా ఇంకా మిగిలి ఉన్నా.., కోటా కేటాయించడం లేదంటూ బియ్యం తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా నుంచి బాయిల్డ్ రైస్‌ను క్వింటాలుకు 31 రూపాయల డెలివరీతో ఆంధ్రాకు తరలిస్తు, ఆంధ్రా నుంచి క్వింటాలుకు రూ.30.50తో ఇక్కడకు దించుకుంటున్నారు. ఒక్కో లారీకి 30 నుంచి 32 టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. బాయిల్డ్ కోటా ఉన్న సమయంలో బియ్యం పెట్టని మిల్లర్లు, మిల్లుల నుంచి సీఎంఆర్ బకాయిలు రాబట్టని అధికారులు ఇప్పుడు మిల్లర్లు బాయిల్డ్ కోటా లేదం టూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక మతలాబేంటో తెలియాల్సి ఉంది.

ఇది ఎవరి అలసత్వం..?

జిల్లాలో ఎన్ని మిల్లులు సీఎంఆర్ కోసం ధాన్యం దించుకున్నాయో, మిల్లు సామర్థ్యం మేరకు ప్రతి రోజు ఎన్ని ఏసీకేల బియ్యాన్ని అధికారులు తెప్పించుకుంటున్నారో అధికారులకే తెలియాలి. మిల్లుల్లో దించుకున్న ధాన్యానికి ప్రభుత్వం గడువులోపు మిల్లులకు టార్గెట్ కేటాయించి రాబట్టితే జిల్లాలో ఏ ఒక్క మిల్లు డిఫాల్టులోకి వెళ్లదు. అధికారుల అలసత్వం, పట్టింపులేని తనంతోనే మిల్లర్లు నిర్ల క్ష్యం వహిస్తూ సమయానికి సీఎంఆర్ ఇవ్వక డిఫాల్టులోకి వెళుతున్నారు.

ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరి అలసత్వం వల్ల సీఎంఆర్ ధాన్యం రావడంలో ఆలస్యమవుతుందో అధికారులే చెప్పాలి.