28 August, 2026 | 10:15 AM

ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి

28-08-2026 01:30 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ఆలేరు, ఆగస్ట్ 27 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్ ) కార్యక్రమంపై భువనగిరి పట్టణంలో బి ఎల్ ఏ, బి ఎల్ ఓ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బూత్లో అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా బి ఎల్ ఏలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల్లో సవరణలు, చిరునామా మార్పు వంటి ప్రక్రియల్లో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలకు ముందే ప్రతి బూత్ను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అబ్జర్వర్ ఈవీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవెస్ చిస్తి, పిఎసిఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తాసిల్దార్ జగన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు తదితరులు పాల్గొన్నారు.