19 May, 2026 | 2:44 AM

టీసీఏ తెలంగాణ గోల్డ్ కప్ ప్రారంభం

28-12-2025 12:00 AM

వరంగల్, డిసెంబర్ 27 : గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లను వెలికితీసేందుకు కృషి చేస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రతిష్టాత్మక టోర్నీ తెలంగాణ గోల్డ్ కప్ ఐదో ఎడిషన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఈ టోర్నీని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి ప్రారంభించారు. గత నాలుగేళ్ళుగా యువక్రికెటర్లకు చక్కని వేదికగా నిలిచిన గోల్డ్ కప్‌లో ఈ సారి కూడా తెలంగాణ జిల్లాల జట్లు ఉత్సాహంగా పా ల్గొంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాలకు చెందిన క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకునేందుకు ఇదొక చక్కని వేదికగా తీర్చిదిద్దామని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి చెప్పారు.

తెలంగాణలోని మారుమూల గ్రా మాలకు చెందిన ఆటగాళ్లు దీనిలో భాగమై అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని, గత నాలుగు ఎడిషన్లలో ఎంతోమంది టాలెంట్‌ను అంతా చూసారని గుర్తు చేశారు. గ్రా మీణ ప్రాంతాల్లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. కాగా తొలి రోజు మ్యాచ్‌లలో టీసీఏ ఖమ్మం జట్టు 75 పరుగుల తేడాతో టీసీఏ హన్మకొండ జట్టు పై విజయం సాధించింది. 75 పరుగులు చేసిన ఇమ్రాన్ షేక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యా చ్ అవార్డ్ దక్కింది. మరో మ్యాచ్‌లో టీసీఏ ములుగు జట్టుపై టీసీఏ మహబాబూబాద్ జట్టు 8 వికెట్లతో గెలుపొందగా.. సురేష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.