9 April, 2026 | 12:45 PM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్సై సారంగపాణి

09-04-2026 11:16 AM

ఇల్లందు టౌన్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): యువత మార్గ ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఇల్లందు ఎస్సై సారంగపాణి సూచించారు. ఇల్లందు పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డిఎస్పి వెంకన్న బాబు, సీఐ సురేష్ సూచనలతో పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సారంగపాణి మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని, భవిష్యత్తుపై లక్ష్యంతో సామాజిక సేవ వైపు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రత్నం, చారి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.