ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో(Vedam School) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను(Sri Krishna Janmashtami celebrations) శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉట్టి కట్టి విద్యార్థులచేత ఉట్టిని కొట్టించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ మాట్లాడుతూ. శ్రీకృష్ణుని జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణుని లీలల గురించి విద్యార్థులకు వివరించారు. పాఠశాలలోని విద్యార్థులు బాలకృష్ణుడు గోపికల వేషధారణలో బృందావనాన్ని తలపించారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా వారిలో భక్తి భావన పెంపొందించేందుకు వేడుకలను జరిపించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






