4 September, 2026 | 7:31 PM

ఆలేరులో విద్యార్థి యువజన భారీ ర్యాలీ

04-09-2026 | 05:30pm

ఆలేరు,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) పిలుపు మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్‌ 5న ఆలేరులో విద్యార్థి–యువజన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆలేరు మండల(Aler Mandal) బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు ఐలి కృష్ణగౌడ్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆలేరులోని పాల సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee reimbursement), స్కాలర్‌షిప్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కృష్ణగౌడ్ పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాగల రమేష్, ప్రతికంఠం శంతన రాజు, పల్లె సంతోష్ గౌడ్, దయాకర్ కుమ్మగాని  రామారావు,  జైరాబాద్ బాల్ సింగ్ నాయక్ ఆయిలి కృష్ణ, పూల శ్రవణ్, కేమెడీ సిద్దేశ్వర్, ఠాగూర్ భగత్ సింగ్,మోరిగాడి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.