కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై బీఆర్‌ఎస్ వంటావార్పు నిరసన
రాయికోడ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్(BRS) మండల అధ్యక్షుడు చేవెళ్ల విట్టల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయికోడ్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్(Former MLA Kanti Kiran), మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మంజు శ్రీ జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి(Unemployment benefit), ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల సాయం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, విద్యార్థులకు విద్యా భరోసా, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.






