పసుపు బండారి రూపంలో గణపేశ్వరుడు
పట్టు వస్త్రాలను సమర్పించిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య దంపతులు
గణపురం,సెప్టెంబర్ 04 (విజయ క్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాస ఉత్సవాల్లో(Shravan masam celebrations) భాగంగా శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గణపేశ్వరుడిని పసుపు బండారి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని ప్రస్తుత ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య కీర్తి దంపతులు భవాని సహిత గణపేశ్వరుడికి పట్టు వస్త్రాలను అందజేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం అనంతరం భక్తులకు అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలను బహుకరించిన సిపి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.






