4 September, 2026 | 6:50 PM

కాంగ్రెస్ వైఫల్యాలపై వంటా వార్పుతో బీఆర్ఎస్ నిరసన

04-09-2026 | 05:43pm

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన... ప్రజలకు నిరాశే మిగిలింది  

హామీలకు కాలం చెల్లింది.. ప్రజలకు సమాధానం చెప్పాలి

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

 షాద్ నగర్ సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మహిళలు, రైతులు, వికలాంగులు, పేదల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. నందిగామ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వంటా వార్పు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.  కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తూ పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, మాజీ స్త్రీ, శిశు సంక్షేమ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.