4 September, 2026 | 7:04 PM

పట్టణాల్లో హైడ్రా.. పల్లెల్లో భూముల నిషేధం!

04-09-2026 | 05:52pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) దోపిడీ పాలన సాగిస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) ఆరోపించారు. హైదరాబాద్‌లో హైడ్రా(HYDRA) పేరుతో పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు పల్లెల్లో రైతుల పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) కలిసి రైతుల భూముల విషయంలో దోపిడీకి పాల్పడుతున్నారని కోవ లక్ష్మి ఆరోపించారు. పేదలు, రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు.

రైతుల పట్టా(Patta) భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల భూముల క్రయవిక్రయాలు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను పునఃపరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు.