4 September, 2026 | 11:08 AM

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2026

04-09-2026 | 04:55am

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 

ఇంటర్నల్ పోటీల నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ(Vignan's University)లో ఈ-సెల్ ఆధ్వర్యంలో ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(Smart India Hackathon) (ఎస్‌ఐహెచ్) - 2026’లో భాగంగా ఇంటర్నల్ హ్యాకథాన్‌ను నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు డిజిటల్ పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక పోటీలను ఏర్పాటు చేశారు.

క్యాంపస్ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఐఓటీ, ఇతర నూత న విభాగాల్లో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ హ్యాకథాన్‌ను బీఎస్‌ఐటీహెచ్‌యూబీ సాఫ్ట్‌వేర్ సొ ల్యూషన్స్ సంస్థకు చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ అండ్ ఫౌండర్ టి భరత్ కుమార్,సాఫ్ట్‌వేర్ డెవలపర్ నాగారపు చందు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి విద్యార్థుల ప్రాజెక్టులను మూల్యాంకనం చేశారు.ఈ ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి ఎంపిక చేసిన విజేత బృందాలు జాతీయ స్థాయిలో జరిగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2026’ గ్రాండ్ ఫినాలేలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ తరఫున ప్రాతి నిధ్యం వహించనున్నాయి. 

ఈ కార్యక్రమం లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పాల్గొని, విద్యార్థులు కనుగొన్న డిజిటల్ పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచన లతో ముందుకొచ్చే విద్యార్థులకు విజ్ఞాన్స్ ఎల్లప్పుడూ పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ స్థాయి స వాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.