4 September, 2026 | 8:59 AM

ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అద్భుతం

04-09-2026 | 04:50am

తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల( ములుగు జిల్లా) ప్రిన్సిపాల్ రమాదేవి

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి):  గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పాతకాలపు వస్తువులను గిరిజన మ్యూజియంలో పొందుపరచడంతో విద్యార్థినీ లకు పాతతరం గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల (Ancient tribal culture and traditions) పట్ల అవగాహన పెంచుకొని ఈ తరం గిరిజన పిల్లలు ఆచరించడానికి మార్గం సులభం అవుతుందని ములుగు జిల్లా గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.రమాదేవి అన్నారు.

గురువారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ములుగు జిల్లా లోని తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు, అధ్యాపకులు, సిబ్బంది విహారయాత్రలో భాగంగా ట్రైబల్ మ్యూజియం సందర్శించారు.  మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను క్లుప్తంగా తిలకించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం బాల బాలికలకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి  చరిత్రను విద్యార్థినిలకు అర్థమయ్యే విధంగా తెలుగులో ముద్రించి ప్రదర్శించడం విద్యార్థిని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగతమైందన్నారు. మ్యూజియంలో మాత్రం గిరిజనులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం విద్యార్థులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందన్నారు. 

గిరిజన కళాఖండాలు చూపెట్టడం వల్ల వారిలో మేధాశక్తి పెరిగి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి పూర్తిస్థాయిలో తెలుసు కుంటారన్నారు.  పాతతరం గిరిజనులు వాడే పనిముట్లు, ఆదివాసి గిరిజనుల సంస్కృతి భాష, గిరిజనుల వేషధారణ కనుమరుగు కాకుండా కోయ భాషను పి ఓ రాహుల్ నేర్చుకొని భాష యొక్క అంతర్యాన్ని గిరిజనులు మరిచిపోకుండా అందరూ ఆచరించే విధంగా ఆయన చేస్తున్న కృషికి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పి దుర్గా భవాని సౌజన్య, సిబ్బంది విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.