4 September, 2026 | 12:08 PM

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం

04-09-2026 | 04:50am
  1. కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం
  2. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలోని ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని, అలా నిరూపించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు ఉందా  మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు(Minister Tummala Nageswara Rao) సవాల్ విసిరారు.

రఘునాథపాలెం మండ లం కోయచెలక గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సు సమావేశంలో పువ్వాడ అజ య్ కుమార్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ రూ. 2 లక్షల వరకు పూర్తిగా మాఫీ చేస్తామని 100రోజుల్లోపే అమలు చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్ కోతలు పెడుతూ కేవలం అరకొరగా మాత్రమే రుణమాఫీ పూర్తి చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా మెజారిటీ రైతులకు రుణమాఫీ కాలేదని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. 

కేసీఆర్ హయాంలో ఏటా ఎకరానికి రూ. 10,000 చొప్పున క్రమం తప్పకుండా అందించిన ‘రైతు బంధు’ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి, రైతులకు రూ. 15,000 ఇస్తామన్న హామీని పక్కన బెట్టిందని మండిపడ్డారు. కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఒక్క రూపా యి కూడా అందించలేదు.

కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేకుండా చూస్తే, నేడు కాంగ్రెస్ హయాంలో యూరి యా కోసం యాప్లలో బుకింగ్స్, క్యూ లైన్లు, చెప్పులు లైన్లో పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గం టల ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతోందని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ సుభిక్షంగా మారుతుందని స్పష్టం చేశారు.