calender_icon.png 14 February, 2026 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా

14-02-2026 01:43:00 AM

  1. సిరిసిల్లలో బీఆర్‌ఎస్

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ హవా

హుజూరాబాద్, ధర్మపురి, చొప్పదండి, జగిత్యాల, కోరుట్లలో కాంగ్రెస్

జమ్మికుంట, వేములవాడ, మెట్పల్లి, రాయికల్లో హంగ్

కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): ఉత్కంఠభరితంగా సాగిన పురపోరులో ఓటరన్న మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కరీంనగర్ నగరపాలక సంస్థపై కా షాయం జెండా ఎగురనుంది. ఇక్కడ ఆ పార్టీకి అంచనాలకు మించి స్థానాలు రావ డం విశేషం. బీజేపీ 30, కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 9 స్థానాలకు పరిమితయ్యాయి. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలు సాధిచింది.

మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో, అలాగే జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి, హుజూరాబాద్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా జమ్మికుంటలో హంగ్ ఏర్పాడే పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లా జగిత్యాలలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు ద క్కించుకోగా జీవన్ రెడ్డి తన వర్గీయులను గె లిపించుకుని సత్తాచాటారు.

రాయికల్లో మె జార్టీ స్థానాలు బీజేపీ దక్కించుకున్నా ఇక్కడే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. కోరుట్లలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ధర్మపురి మున్సిపాలిటీలో 15 కు 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. మెట్పల్లిలో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించినా ఇక్కడ కూడా హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయి. వేములవాడలో కాంగ్రె స్ కు మెజార్టీ స్థానాలు వచ్చినా ఇతరుల మద్దతు అవసరం కానుంది.

- మున్సిపాలిటీలో వార్డుల వారీగా బలాబలాలు...

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా బీజేపీ అభ్యర్థులు 30 డివి జన్లలో, కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9, ఏఐఎఫ్బి 2, ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో గెలుపొందారు. రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 38, బీఆర్‌ఎస్ 13, ఏఐఎఫ్బి 5, సీపీఐ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపొందారు. జగిత్యాల మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ 23, బీఆర్‌ఎస్ 4, బీజేపీ 6, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 9(జీవన్ రెడ్డి వర్గం), ఇతరులు 6 స్థానాలు సాధించా రు. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా బీజేపీ 5,

బీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానం సాధించారు. ధర్మపురి మున్సిపాలిటీలో 15 స్థానాలకుగాను 15 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డు లలో కాంగ్రెస్ 18, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 6, ఇండిపెండెంట్ ఒక స్థానం సాధించారు. మెట్పల్లిలో మొత్తం 26 స్థానాలు ఉండగా బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 6, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందారు. సిరి సిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 27, కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇండిపెండెంట్ 1 స్థానం సాధించారు.

వేముల వాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండ గా కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్‌ఎస్ 5, ఇద్ద రు ఇండిపెండెంట్లు గెలుపొందారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులలో కాంగ్రెస్ 16, బీఆర్‌ఎస్ 8, బీ జేపీ 5, ఇండిపెండెంట్ ఒక స్థానం గెలుపొందారు. జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3, ఏఐఎఫ్బి నుండి ఒకరు గెలు పొందారు.

చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులలో 10 కాంగ్రెస్, బీజేపీ 3, బీఆర్‌ఎస్1 స్థానాల్లో గెలుపొందాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 28, బీఆర్‌ఎస్ 6, ఏఐఎఫ్ 5, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు ఉండగా 11 కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలుపొందారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12, బీజేపీ 1, బీఆర్‌ఎస్ 1, ఏఐఎఫ్బి 1 స్థానాల్లో గెలుపొందాయి.

- క్యాంపునకు తరలివెళ్తున్న అభ్యర్థులు...

కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థులతోపాటు ఉమ్మడి జిల్లాలోని మున్సిపా లిటీల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. 1 గెలుపొందిన అభ్యర్థులు చేజారకుండా క్యాంపులకు తరలించారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన అనంతరం ఎంపీ కార్యాలయానికి వెళ్లి కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపి క్యాంపునకు తరలివెళ్లారు. మేయర్, చైర్మన్ల ఎన్నిక 16న ఉండడంతో అదేరోజు నేరుగా ఆయా మున్సిపాలిటీలకు గెలుపొందిన అభ్యర్థులను తీసుకువచ్చే విధంగా బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపొందిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి.