అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం
31-03-2026 10:51 AM
పంటలు నేలమట్టం, రైతులపై అప్పుల భారము
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో(Kubeer Mandal) సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు భారీ నష్టం మిగిల్చింది. కోత దశకు చేరుకున్న జొన్న, మొక్కజొన్న పంటలు గాలులతో కలిసి నేలకూలిపోయాయి. పంట(Crop Damage) చేతికొస్తుందని ఆశించిన సమయంలోనే ప్రకృతి విరుచుకుపడటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. స్థానిక అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని రైతులు(Farmers) కోరుతున్నారు. తక్షణ నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు నిరాశలో మునిగిపోయారు.







